• Neti Charithra

Breaking...మూడు మృత దేహాలతో నడి రోడ్డుపై బైటాయింపు.. చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!


Breaking...మూడు మృత దేహాలతో నడి రోడ్డుపై బైటాయింపు.. చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!





వి కోట: నేటి చరిత్ర



తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదం లో

చిత్తూరు జిల్లా కు చెందిన ముగ్గురు మృతి చెందారు. శనివారం రాత్రి మృతదేహలతో బాధితకుటుంబీకులు నిరసనకు దిగటం తో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.చిత్తూరు జిల్లా వికోట మండలం రామతీర్థం వద్ద మూడు మృతదేహాలతో లారీ యజమాని ఇంటి ముందు ఉంచి బంధువులు ఆందోళనకు దిగారు. రాతి


కుసాల లోడుతో తమిళనాడు సమీపంలో వేలూరు వద్ద శనివారం తెల్లవారుజామున మినీలారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో వి.కోట మండలానికి చెందిన ముగ్గురు కూలీలు దుర్మరణం చెందారు. కేసు నమోదు చేసిన తమిళనాడు



పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు తీసుకురాగా లారీ యజమాని మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారం అందజేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు పక్షాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే గ్రామపెద్దల రాజీకి చేసొన ప్రయత్నం విఫలం కావడంతో ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అందుకు లారీ యజమాని అంగీకరించకపోవడంతో మృతదేహాలకు నీవే అంత్యక్రియలు చేస్కో అంటూ మృతదేహాలను లారీ యజమాని ఇంటి ముందు ఉంచి బంధువులందరూ వెనుదిరిగారు. దీంతో రామతీర్థం గ్రామ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్