- Neti Charithra
Breaking.. మోడీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి..!
Breaking.. మోడీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసిన పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం
తిరుమల శ్రీవారిని పుదుచ్చేరి సీఎం వి. నారాయణస్వామి ఆదివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన దేశ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ
ప్రస్తుతం దేశంలో నిరంకుశ పాలన కనిపిస్తుందన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం.. భాగస్వామ్య పక్షాలకు, ప్రతిపక్షాలకు విలువ ఇవ్వట్లేదని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతు వ్యతిరేకమైనవని ఆయన
అభిప్రాయపడ్డారు. యూపీఏ ప్రభుత్వంలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూశామని చెప్పిన నారాయణస్వామి.. మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు.
198 views0 comments