• Neti Charithra

Breaking.. మిట్స్ లో 98 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు..!


Breaking.. మిట్స్ లో 98 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు..!


కురబలకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లి కళాశాల నందు బి.టెక్ చివరి సంవత్సరము చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 98 మందికి ఉద్యోగాలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.

యువరాజ్ తెలిపారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ (సి.టి.ఎస్) వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఉద్యోగాలు లభించినట్లు ఆయన అన్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగము నుండి 33 మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి 1, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 40, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 6, మెకానికల్ ఇంజనీరింగ్ 8, సివిల్ ఇంజనీరింగ్ నుండి 2

మరియు ఏం.సి.ఏ నుండి 2 విద్యార్థులు కు ఉద్యోగాలు లభించినట్లు ఆయన అన్నారు. వీరికి సంవత్సరము కు 4.1 లక్షల జీతమని అన్నారు. ఈ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ యువరాజ్, డీన్ ప్లేసెమెంట్ డాక్టర్. రామప్రసాద్ రావు, తదితరులు అభినందనలు తెలియజేసారు

249 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon