• Neti Charithra

Breaking.. మెట్రో రైలు ..తయారీలో రికార్డు సృష్టించిన చిత్తూరు జిల్లా..!


Breaking.. మెట్రో రైలు ..తయారీలో రికార్డు సృష్టించిన చిత్తూరు జిల్లా..!

..

సత్యవేడు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఆల్ స్టామ్ మెట్రో రైళ్ల తయారీ పరిశ్రమ లో తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. అర్బన్ మెట్రో ప్రాజెక్టుల కోసం రోలింగ్ స్టాక్ (మెట్రో రైళ్లు) ను తయారుచేసే శ్రీసిటీ ఫ్యాక్టరీ లో 500వ మెట్రో రైల్ పెట్టె ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఆల్స్టోమ్ యొక్క అతిపెద్ద అర్బన్ రోలింగ్ స్టాక్ తయారీ విభాగం శ్రీసిటీ ఉన్నది. ఇక్కడ నుంచి చెన్నై, కొచ్చి, లక్నో, ముంబై వంటి భారతీయ నగరాలే కాకుండా సిడ్నీ, మాంట్రియల్ తదితర ప్రపంచవ్యాప్త


నగరాలకు కూడా మెట్రో రైళ్లను సరఫరా చేస్తోంది. ఈ మైలురాయిపై ఆల్స్టోమ్ ఇండియా మరియు దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ అలైన్ స్పోర్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ధాటికి పరిశ్రమల వ్యాపారాలకు అంతరాయం ఏర్పడినప్పటికీ, తమ బృందాలు అవిశ్రాంతంగా పనిచేస్తూ, మెట్రో కార్పొరేషన్లకు సకాలంలో ఉత్పత్తులను

అందచేస్తున్నాయన్నారు. ప్రయాణీకుల అనుభవంతో మెరుగైన, అత్యధిక భద్రతా లక్షణాలను కలిగి ఉన్న ట్రెయిన్‌సెట్‌లను తాము తయారు చేస్తున్నాము అన్నారు. 75 శాతం స్థానికీకరణతో మేక్-ఇన్-ఇండియా పట్ల మా నిబద్ధత కొనసాగుతోందన్నారు. భారతదేశంలో ఆల్స్టోమ్ వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉందని తెలిపారు. బెంగళూరులోని ఇన్నోవేషన్ సెంటర్‌లో ఇంజనీరింగ్ పరిష్కారాలను అభివృద్ధి చేయడం, మాధేపురా యూనిట్‌లోని ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ (ఇలోకో), కోయంబత్తూర్‌లోని రైల్ కాంపోనెంట్స్ మరియు కోల్‌కతాలో ఇలోకో కార్ బాడీ షెల్ ఉత్పత్తి చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించినందుకు ఆల్స్టోమ్ ఇండియా జట్టును అభినందిస్తూ, శ్రీ సిటీ వ్యవస్థాపక డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, "ఇది ఆల్స్టోమ్ కు మరియు శ్రీ సిటీకి కూడా సంతోషకరమైన సందర్భం. మేము గర్వంగా భావిస్తున్నాము. దేశీయ అవసరాలకు మరియు ఎగుమతుల కోసం మెట్రో కార్లను తయారు చేయడం ద్వారా, శ్రీ సిటీ ప్లాంట్, 'మేక్ ఇన్ ఇండియా' కు పర్యాయ పదంగా మారిందని అన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం రాష్ట్రంలో మొట్టమొదటి నైపుణ్య శిక్షణాకేంద్రం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.

అత్యాధునిక ఉత్పాదక ప్రమాణాలకు పేరుగాంచిన శ్రీసిటీలోని ఆల్స్టోమ్ ఉత్పత్తి కేంద్రం, చెన్నై మెట్రో తయారీతో సెప్టెంబర్ 2012 లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇక్కడ 20 లక్షలకు పైగా తయారీ మరియు పరీక్షా గంటలను నమోదు చేసింది. ఇటీవల, భారతదేశంలో అన్‌లాక్ 1.0 వచ్చిన తరువాత, ఇక్కడ నుంచి కెనడా నగరమైన మాంట్రియల్ (రీసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటైన్) కోసం రెండు రైళ్ల మొదటి బ్యాచ్‌ను విజయవంతంగా పంపించింది. ప్రస్తుతం, ముంబై మెట్రో ఎల్-3 (ఆక్వా లైన్), మాంట్రియల్ మెట్రో - రీసో ఎక్స్‌ప్రెస్ మెట్రోపాలిటైన్ మరియు సిడ్నీ మెట్రో (సిటీ మరియు నైరుతి పొడిగింపు) కోసం రైళ్లను తయారు చేస్తోంది. ఈ కర్మాగారంలో పర్యవేక్షకులు, ప్లానర్లు, ఇంజనీర్లు మొదలైన వివిధ హోదాలలో 15 శాతం కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

రాష్ట్రంలో ప్రప్రధమంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

(ఎపిఎస్‌ఎస్‌డిసి), శ్రీసిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పరిశ్రమ ఆధారిత నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ నియామక కేంద్రం (ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ సెంటర్ - ఐసిఎస్‌టిపిసి) ను ఆల్స్టోమ్ లో ఏర్పాటు చేయడం కూడా

దీని ప్రత్యేకతగా పేర్కొనవచ్చు.

ఇందులో పరిశ్రమల అవసరాల మేరకు అదే పరిశ్రమల వారిచే నిరుద్యోగ యువతకు తగు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ప్రస్తుతం మొదటి బ్యాచ్ శిక్షణ కొనసాగుతోందని సంస్థ ప్రతిని థులు పేర్కొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్