• Neti Charithra

Breaking.. మాజీ హోం శాఖ మంత్రి అనారోగ్యంతో మృతి..!


Breaking.. మాజీ హోం శాఖ మంత్రి అనారోగ్యంతో మృతి..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, కార్మిక నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్థరాత్రి మరణించారు. సెప్టెంబర్‌ 28న కరోనా బారిన పడిన ఆయన బంజారాహిల్స్‌లోని ఒక ఆస్పత్రిలో చికితస్స పొందారు. కరోనా నుండి

కోలుకున్నప్పటికీ.. అనారోగ్య సమస్యలు బాధించాయి. న్యూమోనియా సోకడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 13న అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అర్థరాత్రి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నాయినికి భార్య అహల్య, కుమారుడు



దేవేందర్‌ రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి ఉన్నారు. ఆయన అల్లుడు వి.శ్రీనివాస్‌ రెడ్డి రాంనగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, నాయిని మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.