• Neti Charithra

Breaking.. మాజీ సీఎం కుటుంబం లో జంట హత్యల కల కలం..!


Breaking.. మాజీ సీఎం కుటుంబం లో జంట హత్యల కల కలం..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)


ఉత్తరప్రదేశ్ లో దారుణ హత్యలు జరిగాయి.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బంధువు మరియు అతని భార్య గ్రేటర్ నోయిడాలోని వారి నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.. కమల్‌నాథ్ కజిన్ నరేంద్రనాథ్ (70), ఆయన భార్య సుమన్(65)గా గుర్తించారు పోలీసులు.. నరేంద్రనాథ్ మృతదేహాన్ని ఇంటి

బేస్‌మెంట్‌లో బట్టల కుప్పలో గుర్తించగా, సుమన్‌ మొదటి అంతస్తులోని హాల్‌లో దారుణంగా హత్య చేశారు. నరేంద్రను గొంతు నులిమి చంపడానికి ముందు ఆయన నోట్లో గుడ్డలు కుక్కి, కట్టేసి దాడి చేసినట్టుగా ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు.. ఆయన భార్యపై కూడా మొదట దాడి చేసి.. ఆ తర్వాత గన్‌తో కాల్చి చంపేశారని చెబుతున్నారు. ఈ వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు దుండగులు. కాగా, గ్రేటర్ నోయిడాలోని ఆల్ఫా 2 సెక్టార్‌లో ఈ వృద్ధ దంపతులకు మూడు అంతస్తుల ఇల్లు ఉంది.. అయితే, ఆయన విడిభాగాల వ్యాపారాన్ని కలిగి ఉన్నారు.. అంతేకాదు.. ఆయన పరిచయస్తులు, పరిసరాల్లోని విక్రేతలకు డబ్బు కూడా ఇస్తారని తెలుస్తుండగా.. సుమన్ ఢిల్లీకి చెందిన ఒక ఎన్జీవోలో యోగా సాధన చేసేవారు. అయితే, నరేంద్రనాథ్ తరచూ ఆయన ఇంటి బేస్‌మెంట్‌లో చిరు వ్యాపారులు, కూలీలు, ఎలక్ట్రీషియన్లను కలుస్తుంటారు. హత్య జరిగిన రోజు రాత్రి కూడా కొంతమందిని ఆయన పార్టీ కోసం ఇంటికి ఆహ్వానించారని.. ఘటన జరిగిన ప్రాంతంలో వైన్ గ్లాసులు, మద్యం సీసాలు చూస్తూ తెలుస్తుందంటున్నారు పోలీసులు. ఇక, హత్యకు ముందు తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడిన సుమన్.. బేస్‌మెంట్‌లో పార్టీ జరుగుతున్నట్టు చెప్పారట.. అక్కడ మద్యం తాగుతున్నారని, తింటున్నారని.. కాబట్టి అక్కడికి వెళ్లడం తనకు ఇష్టం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే, అక్కడ పార్టీ చేసుకున్నవారే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు..

631 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon