- Neti Charithra
Breaking.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ అధికారులకు మూకుమ్మడి..కరోనా..!
Breaking.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు సీబీఐ అధికారులకు మూకుమ్మడి..కరోనా..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక అధికారులకు కరోనా సోకడం కల కలం రేపుతోంది.ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న
ఓ కీలక అధికారికి మూడు రోజుల క్రితం
కరోనా పాజిటివ్ తేలింది. ఆతర్వాత
పరీక్షలు చేసుకున్న మరో ఆరుగురు సీబీఐ అధికారులకు శుక్రవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తమ బృందంలోని
దాదాపు సగం మందికి కరోనా సోకడంతో సీబీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా సోకిన సీబీఐ అధికారులు స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స
పొందడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో రెండో విడత దర్యాప్తు కోసం గత నెలలో సుమారు 15 మంది సీబీఐ అధికారులు కడప జిల్లాకు చేరుకున్నారు.
311 views0 comments