• Neti Charithra

Breaking..మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు కు కొత్త "సీబీఐ " అధికారులు ను కేటాయించిన కేంద్రం!


Breaking..మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు కు కొత్త "సీబీఐ " అధికారులు ను కేటాయించిన కేంద్రం!



కడప : నేటి చరిత్ర


మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు

విచారణకు ఢిల్లీ నుంచి మరో సీబీఐ బృందం కడప కు రానుంది.

నేటి నుంచి వివేకా హత్య కేసు విచారణ తిరిగి కొనసాగనుంది. ఈ కేసుపై సిబిఐ

దర్యాప్తు కొనసాగుతోన్న నేపథ్యంలో.. సిబిఐ బృందంలోని 15 మంది సభ్యుల్లో ఏడుగురికి కరోనా సోకడంతో విచారణకు కొంత అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు. వివేకా హత్య కేసు విచారణ కొనసాగింపునకు గాను

అధికారులు కొత్త టీం ను ఏర్పాటు చేశారు. కొత్త సిబిఐ బృందం ఈరోజు ఢిల్లీ నుండి కడపకు చేరుకునే అవకాశముంది. సిబిఐ అధికారులు కడపకు చేరుకున్న తరువాత యథావిధిగా విచారణ కొనసాగనుంది.