• Neti Charithra

Breaking.. మాజీ మంత్రి తోపాటు టీడీపీ కీలక నేతలు అరెస్ట్.. చిత్తూరు జిల్లా లో ఉద్రిక్తత..!


Breaking.. మాజీ మంత్రి తోపాటు

టీడీపీ కీలక నేతలు అరెస్ట్.. చిత్తూరు జిల్లా లో ఉద్రిక్తత..!




కుప్పం: నేటి చరిత్ర


(రామకుప్పం లో నిరసనలకు దిగిన టీడీపీ నేతలు)


(పోలీసుల కళ్ళు కప్పి హంద్రీనీవా కాల్వలలో నిరసనలు చేస్తున్న టీడీపీ శ్రేణులు)


( టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ లు)


(టీడీపీ కి పోటీగా ర్యాలీ చేస్తున్న వైసీపీ శ్రేణులు)



(చిత్తూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు నాని ని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు)


చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను

పోలీసులు భగ్నం చేయడం తో ఉద్రిక్తత చిటుచేసుకుంది.జిల్లాలో ఎక్కడిక్కడ టిడిపి ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.  చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా  అటు తెదేపా పోటాపోటీ

పాదయాత్రలు, ర్యాలీలకు పిలుపునిచ్చాయి. తెదేపా శ్రేణులు హంద్రీ-నీవా సాధన కోసం పాదయాత్రను తలపెడితే వారికి పోటీగా వైకాపా శ్రేణులు చంద్రబాబు పేదల ఇళ్ల పట్టాల విషయంలో హైకోర్టు కి వెళ్లడం పై వ్యతిరేకంగా నిరసన కార్యక్రమానికు శ్రీకారం చుట్టారు. దీంతో

టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు నాని తో పాటుపలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి ని గృహనిర్బంధం చేసిన పోలీసులు, కుప్పంలో ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు ,రామకుప్పం మండలంలో టీడీపీ మండలాధ్యక్షుడు అంజినేయరెడ్డి, మండల ఇంచార్జి మునస్వామిలతో పాటు

పలువురు నేతలని హౌస్ అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పాదయాత్ర కు టిడిపి సిద్ధమైన నేపథ్యంలో వ్యతిరేకంగా వైసిపి కూడా ఆందోళనకు సిద్ధమైంది. దీంతో కుప్పానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


566 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon