• Neti Charithra

Breaking.. మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి.. కడపజిల్లా టీడీపీ లో విషాదం..!


Breaking..

మాజీ ఎమ్మెల్యే గుండెపోటుతో మృతి.. కడపజిల్లా టీడీపీ లో విషాదం..!



కడప: నేటి చరిత్ర


తెలుగుదేశం పార్టీ సీనియర్

నేత కందుల శివానందరెడ్డి బుధవారం గుండెపోటు తో మృతి చెందారు.

కందుల శివానందరెడ్డి కడప ఎమ్మెల్యేగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరుపున విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన

తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ తరుపున 2004, 2009లో పోటీ చేసిన కందుల శివానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు


దూరంగా ఉంటున్నారు. ఆయన మృతిపట్ల మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.