- Neti Charithra
Breaking.. మహిళా సంఘాల డబ్బు..రూ.3 లక్షలు స్వాహా..బి కొత్తకోట లో కేసు నమోదు చేసిన పోలీసులు..!
Breaking.. మహిళా సంఘాల డబ్బు..రూ.3 లక్షలు స్వాహా..బి కొత్తకోట లో కేసు నమోదు చేసిన పోలీసులు..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో
ఓ మహిళ సంఘం గ్రూపులో రూ. 3 లక్షలు నిధులు స్వాహా కావడం కల కలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన బిరంగి
గ్రామం కాచిపల్లె కు చెందిన రెండవ గ్రామ సమైక్య లోని జయలక్షి గ్రూప్ లోని నిధులు భారీగా దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. ఈ గ్రూపు లో మొత్తం రూ.3 లక్షలు కు పైగా సభ్యుల డబ్బులు ను
మొదటి లీడర్ సుజాత గత కొంత కాలం గా
గ్రూప్ కు సంభందించిన లావా దేవిలు జరుపుతూ మినిట్స్ బుక్స్
నందు ఫోర్జరీ రసీదు పెట్టి లక్షల్లో
స్వాహా చేసినట్లు గ్రూప్ సభ్యులు
గుర్తించి ఆమె పై పోలీసులు కు
పిర్యాదు చేయడంతో
ఆమె పై కేసు నమోదు చేసినట్లు
యస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు.
కాగ ఒకే గ్రూపులో ఇంత పెద్ద మొత్తం లో నిధులు స్వాహా కావడం .. ఈ విషయం లో నిధులు రికవరీ చేయాల్సిన పర్యవేక్షణ అధికారులు .. సమస్య పోలీస్ కేసుల వరకు వెళ్లేంత వరకు ఎందుకు నిర్లక్ష్యం వహించారనే కోటి అనుమానాలు వెంటాడుతున్నాయి. పలువురు పర్యవేక్షణ సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తోంది.