• Neti Charithra

Breaking.. మహిళా వాలంటీర్ ను సజీవ దహనం చేసిన దుండగులు..!


Breaking.. మహిళా వాలంటీర్ ను సజీవ దహనం చేసిన దుండగులు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఒంగోలు శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. దశరాజుపల్లి రోడ్డులోని చిన్నవెంకన్న కుంట వద్ద దివ్యాంగురాలు సజీవ దహనమైంది. ఇది హత్య అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతురాలి తల్లి మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తోంది. నగరంలోని కమ్మపాలెం మూడో లైన్‌లో నివాసం ఉండే ఉమ్మనేని భువనేశ్వరి (22) దివ్యాంగురాలు. ఆమె నగరంలోని 12వ వార్డు సచివాలయంలో వలంటీర్‌గా పని చేస్తోంది. దూర విద్య ద్వారా నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అక్క మానసిక వికలాంగురాలు. భువనేశ్వరి తల్లి జానకి ప్రకాశం భవన్‌ ఎదుట ఉన్న బుక్‌ డిపోలో పని చేస్తూ ఇద్దరు కూతుళ్లను పెంచింది. భువనేశ్వరి రోజూమాదిరిగానే శుక్రవారం సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం 6.49 గంటల సమయంలో తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఆతర్వాత ఇంటికి రాలేదు. జానకి రాత్రి 8 గంటల సమయంలో

కుమార్తెకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆమె వెతుకులాడటం ప్రారంభించింది. రాత్రి 8 గంటల తర్వాత దశరాజుపల్లి రోడ్డులోని చినవెంకన్న కుంట వద్ద మూడు చక్రాల సైకిల్‌పై ఓ యువతి తగులబడుతుందన్న సమాచారాన్ని కిమ్స్‌ ఆసుపత్రిలోని సెక్యూరిటీ ఆఫీసర్‌ తాలూకా పోలీసులకు ఫోన్‌ చేసి ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా ఆమె మంటల్లో తగులబడుతూ కన్పించింది. వెంటనే ఫైరింజన్‌ను పిలిపించి మంటలు ఆర్పారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి ఘటనా స్థలానికి చేరుకుంది. తన కుమార్తె ఎంతో ధైర్యవంతురాలని తెలిపింది. ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. కాలిపోయే సమయంలో భువనేశ్వరి శరీరం నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడం కూడా అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. అదేసమయంలో భువనేశ్వరి తన వాట్సాప్‌లో 6.50 గంటలకు ఒక పోస్టు పంపింది. ఇక తన వాట్సాప్‌ పని చేయదని, ఎవ్వరూ చూడవద్దని అందులో పేర్కొంది. తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి, టూటౌన్‌ సీఐ రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్