- Neti Charithra
Breaking.. మహిళా కానిస్టేబుల్ పై పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులు..!
Breaking.. మహిళా కానిస్టేబుల్ పై పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ పట్ల
ఓఎస్ఐ లైంగిక వేధింపులు కు పాల్పడిన ఘటన వివాదంగా మారింది. తరచుగా
డబుల్ మీనింగ్ డైలాగులతో మహిళా
కానిస్టేబుల్‌ను ఆయన వేధించాడు. నెల రోజుల క్రితమే ఎస్సై బదిలీపై తాలూకా స్టేషన్‌కు వచ్చాడు. లోపల ఏం జరుగుతుందో కనిపించకుండా ఛాంబర్‌కు కర్టెన్లు వేయించాడు. మహిళా కానిస్టేబుల్‌ను తన ఛాంబర్‌కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తిసూ తీవ్రంగా బాధపెట్టాడు. వేధింపులు ఎక్కువవడంతో ఎస్ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ ఐ పై వేటు పడే అవకాశాలు కనబడుతున్నాయి. జిల్లా లో ఈ ఘటన పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారింది.