• Neti Charithra

Breaking.. మళ్ళీ..మళ్ళీ..లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన మహిళా విఆర్వో..!


Breaking.. మళ్ళీ..మళ్ళీ..లంచం తీసుకుంటూ..ఏసీబీ కి చిక్కిన మహిళా విఆర్వో..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


రైతు నుంచి లంచం డిమాండ్ చేసి.. ఓ మహిళా విఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి

ములగపూడి వీఆర్వో కొలగాటి దేవత లంచం తీసుకుంటుండగా గురువారం ఏసీబీ అధికారులు రౌతులపూడి తహసీల్దారు కార్యాలయంలో

పట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం... అన్నవరం గ్రామానికి చెందిన బుర్రా సూరిబాబుకు ములగపూడి 209 సర్వే నంబరులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని ఆయన కుమారుడు బుర్రా నాగవీరబాబు తన పేరిట మార్చుకునేందుకు వీఆర్వో దేవతను ఆశ్రయించారు. రూ.7వేలు లంచం ఇవ్వాలని వీఆర్వో అడగడంతో రూ.5 వేలు ఇస్తానని వీరబాబు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గురువారం ఉదయం వీరబాబు రూ.5 వేలు నగదు వీఆర్వో దేవతకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో రూ.39 వేలు ఇచ్చానని మళ్లీ సొమ్ములు అడిగేసరికి విసుగుచెంది ఏసీబీని ఆశ్రయించినట్లు వీరబాబు చెప్పారు.

541 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon