• Neti Charithra

Breaking.. మరో సైనికుడు.. మృతి.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. మరో

సైనికుడు.. మృతి.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


రామసముద్రం: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లారామసముద్రం మండలం అరికెలకు చెందిన సైనికుడు రాజశేఖర్‌రెడ్డి(34) అనారోగ్యంతో మృతి

చెందడం తో మండలం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యుల కథనం మేరకు..

రామసముద్రం మండలానికి చెందిన

రాజశేఖర్‌రెడ్డి 2004లో ఆర్మీలో సైనికుడిగా చేరారు. ప్రస్తుతం ఆగ్రాలో పని చేస్తున్నారు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురై సెలవుపై సొంత గ్రామానికి వచ్చారు. తిరుపతి, బెంగళూరు వంటి నగరాల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం

లేకపోయింది. చివరకు నెల రోజుల క్రితం దిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. మృతుడికి తల్లిదండ్రులు రామస్వామిరెడ్డి, ప్రమీలమ్మతో పాటు భార్య మమత, కుమార్తె అస్మిత, కుమారుడు కేతవ్‌రెడ్డి ఉన్నారు. కుమారుడు మృతి చెందిన సమాచారం గురువారం తల్లిదండ్రులకు అందింది. ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది.