• Neti Charithra

Breaking..మరో ప్రేమోన్మాది ..ఘాతకం.. పది విద్యార్థిని మెడలో తాళి కట్టబోతు.. పురుగుల మందుతో హైడ్రామా!


Breaking..మరో ప్రేమోన్మాది ..ఘాతకం..

పది విద్యార్థిని మెడలో తాళి కట్టబోతు..

పురుగుల మందుతో హైడ్రామా!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల కేంద్రంలో ఓ ప్రేమోన్మాది ఘతుకానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించింది. పోలీసులు కథనం మేరకు..అనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతోంది. సోమవారం తరగతులు ప్రారంభానికి ముందు అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సత్తి శివారెడ్డి (23) తాళిబొట్టుతో అకస్మాత్తుగా పదో తరగతి గదిలోకి ప్రవేశించాడు. ఆ బాలికకు తాళి కడతానంటూ హడావుడి చేయడంతో అదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సోదరుడు, మరికొందరు ఆ యువకుడిని బయటకు నెట్టేశారు. ఉపాధ్యాయులు

కూడా అక్కడికి చేరుకోవడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడు శివారెడ్డి.. బాలిక ఇంటి వద్దకు చేరుకొని పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.

395 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon