• Neti Charithra

Breaking..మద్యం మత్తు లో కత్తి తో యువకుని గొంతు కోసిన గ్రామ వాలంటీర్ ..!


Breaking..మద్యం మత్తు లో కత్తి తో

యువకుని గొంతు కోసిన గ్రామ వాలంటీర్ ..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


మద్యం మత్తులో ఓ యువకునిపై

గ్రామ వాలంటీర్ కత్తి తో గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కల కలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామ వాలంటీరు తన స్నేహితులతో కలిసి ఓ యువకుడిపై దాడి చేసి, మెడపై కోసి గాయపరిచిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెలలో శనివారం రాత్రి

చోటుచేసుకుంది. కొత్తపేట పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... పలివెల గ్రామానికి చెందిన మోకా నాగరాజు, గ్రామ వాలంటీరు తులా సతీష్‌, అతని స్నేహితులు రెండ్రోజుల క్రితం మద్యం తాగారు. ఈ సందర్భంలో వీరి మధ్య వివాదం జరిగింది. స్నేహితుల దగ్గర నాగరాజు చులకనగా మాట్లాడడంతో సతీష్‌ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి నాగరాజు ఇంటికి తులా సతీష్‌ స్నేహితులతో వచ్చి ఘర్షణ పడ్డాడు. ఈ సమయంలో నాగరాజు సోదరుడు మోకా ప్రసాద్‌ అడ్డురావడంతో అతని తలపై సతీష్‌, స్నేహితులు సీసాతో కొట్టి, కత్తితో మెడపై కోశారు. స్థానికులు వెంటనే ప్రసాద్‌ను కొత్తపేట ప్రభుత్వాసుప్రతికి తరలించగా మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లినట్లు ఎస్సై రమేష్‌ తెలిపారు.