- Neti Charithra
Breaking.. మద్యం కోసం..పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని..అమ్మమ్మ ను హత్యచేసిన మనువడు..!
Breaking.. మద్యం కోసం..పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని..అమ్మమ్మ ను హత్యచేసిన మనువడు..!
ఆళ్లగడ్డ: నేటి చరిత్ర
మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని ఆమ్మ్మమ్మను సొంత మనవడు
హత్యచేసిన ఘటన కల కలం రేపింది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఘటనకు సంబంధించి.. పుల్లారెడ్డి వీధిలో ఉంటున్న హుస్సేన్‌బీ(75)కి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. భర్త ఖాదర్‌బాషా వ్యవసాయశాఖలో పనిచేస్తూ మృతి చెందటంతో వచ్చే పింఛను సొమ్ముతో జీవనం సాగించేవారు. గతేడాది అక్టోబరులో చిన్న కుమారుడైన అల్తాఫ్(40) కరోనాతో మృతి చెందారు. ఈ బాధతోనే ఉండగా, ఈ మధ్య గూబగుండం గ్రామంలో ఉంటున్న పెద్ద కూతురు కుమారుడైన ఇక్బాల్ తరచూ వృద్ధురాలి వద్దకు వచ్చి డబ్బు కోసం వేధించేవాడు. శుక్రవారం అందరూ కొత్త సంవత్సరం వేడుకల్లో ఉండగా హుస్సేన్‌బీ వద్దకు మద్యం మత్తులో వచ్చి డబ్బులు ఇవ్వమని ఘర్షణ పడినట్లు చుట్టుపక్కల
వాళ్లు తెలిపారు. కొంత సేపటి తర్వాత ఇంటి వద్ద అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రామిరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. మృతురాలి పెద్ద కుమారుడు అమిర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.