• Neti Charithra

Breaking.. మదనపల్లె సమీపం లో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కల కలం..!


Breaking.. మదనపల్లె సమీపం లో

టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కల కలం..!



మదనపల్లె: నేటి చరిత్ర


(కిడ్నాప్ కు గురైన సర్పంచ్ అభ్యర్ది ఓబుల్ రెడ్డి)


టీడీపీ సర్పంచ్ మద్దతు అభ్యర్థి ని ప్రత్యర్ధులు కిడ్నాప్ చేయడం.. చిత్తూరు జిల్లాలో కల కలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నిమ్మనపల్లి మండలం సామకోటవారిపల్లి పంచాయతీ టిడిపి మద్దతు

సర్పంచ్‌ అభ్యర్థి కె. ఓబుల్‌ రెడ్డి కిడ్నాపయ్యారు. గురువారం ఉదయం

వేకువ జామున నుండి కనపడలేదని

కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే.. అధికార పార్టీ నాయకులే ఓబుల్‌రెడ్డిని కిడ్నాప్‌ చేసి ఎక్కడో ఉంచారేమోననే అనుమానాలు వస్తున్నాయి. ఓబుల్‌ రెడ్డికి సంబంధించిన చొక్కా, చెప్పులు, సెల్‌ ఫోన్‌ అతని ఇంటిలోనే పడుకున్న మంచం వద్దనే ఉన్నాయి. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఓటమి భయంతో అధికార వైఎస్సార్‌ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.