• Neti Charithra

Breaking.. మదనపల్లె లో సంత ఆక్రమణలు..తొలగింపు ఉద్యమం ఉద్రిక్తం..25 మంది అరెస్ట్!


Breaking.. మదనపల్లె లో సంత ఆక్రమణలు..తొలగింపు ఉద్యమం ఉద్రిక్తం..25 మంది అరెస్ట్!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా మదనపల్లె అభివృద్ది వేదిక ఆధ్వర్యంలో వారపుసంతలో ఆక్రమణలు తొలగించాలని పిలుపునిచ్చిన ఛలో వారపుసంత కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నెలరోజులకు పైగా

వారపుసంతలో ఆక్రమణలు తొలగించాలని పోరాడుతుంటే అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహంతో ఛలో వారపుసంత కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఛలో వారపుసంతను విఫలం

చేయడానికి పోలీసులు ఉదయం నుండే మొహరించారు. ఛలో వారపుసంతకు అనుమతి లేదని ఎలాంటి ప్దదర్శనలు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు. వారపుసంతలో ఆక్రమణలు తొలగించకుండా ఛలో వారపుసంత విరమింపబోమని ఆందోళన కారులు తేల్చి

చెప్పారు. మున్సిపల్ కార్యాలయం ముందు నుండి బయలుదేరిన ప్రదర్శన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రజాసంఘాల నాయకులు ప్రతిఘటించారు. బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మహిళలు, చిరు వ్యాపారులు వాహనాలకు అడ్డంగా బైఠాయించి, రెండవ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. అందరినీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, ఆందోళన కారులు తోపులాటలో సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు ఊపిరాడక కిందపడిపోయాడు, మహిళా వ్యాపారికి జ్ఞానవతి కి గాయాలయ్యాయి. అరెస్టు అయిన నాయకులు, వ్యాపారులను మజీ ఎంఎల్ఏ షాజహాన్ బాష పరామర్శించారు. 25మందిపై బైండోవర్ కేసులు నమోదు

స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. ముందుగా భారతీయ అంబేద్కర్ సేన నాయకులు శ్రీచందు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాష, టిడిపి మాజీ ఎమ్మెల్యే నాయకులు దొమ్మలపాటి రమేష్, సిపియం జిల్లా కార్యదర్శి చల్లా వెంకటయ్య, సిపియం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.శ్రీనివాసులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణప్ప, ఆర్ఎస్ఎఫ్ నాయకులు ఉత్తన్న తదితరులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుడు నవాజ్ అండదండలతోనే వారపుసంతలో ఆక్రమణలు జరుగుతున్నాయని, అధికారులను భయాందోళనలకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. మున్సిపల్ గెజిట్ కు భిన్నంగా జరుగుతున్న ఆక్రమణలు తొలగించలేని కమీషనరును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారపుసంత పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు టి.హరీంద్రనాథ్ శర్మ, పి.నాగరాజు, ఎం.నారాయణస్వామి, శేషాద్రి, షాహినా, లక్ష్మిదేవి, సిపిఐ నాయకులు కె.మురళి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్ జె వెంకటేష్,

ఆర్.మదుబాబు, విజయలక్ష్మి, రాయలసీమ ఉద్యమ వేదిక నాయకులు లక్ష్మీపతి, బాస్ నాయకులు మోహన్, సూరి, బిఎస్పి నాయకులు కంగేరి నంద, కూరగాయలు, ఆకుకూరలు వ్యాపారులు సంఘం నాయకులు రేఖ, భారతి, హేమ, రాజ, రమణ తదితరులు పాల్గొన్నారు.