• Neti Charithra

Breaking..మదనపల్లె లో లాడ్జి పై పోలీసుల దాడులు ..రూ.2.17 లక్షల నగదు తో పాటు11మంది అరెస్ట్!


Breaking..మదనపల్లె లో లాడ్జి పై

పోలీసుల దాడులు ..రూ.2.17 లక్షల నగదు తో పాటు11మంది అరెస్ట్!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో టూ టౌన్ పోలీసులు శుక్రవారం జరిపిన దాడుల్లో 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రూ.2,17, 630లు నగదును సీజ్ చేశారు. ఈ సందర్భంగా 11 మంది పేకాట రాయుళ్లను ఆరేస్ చేసినట్లు సీఐ నరసింహులు, ఎస్ ఐ వంశీధర్ రెడ్డి లు మీడియాకు వివరించారు. పట్టణం లోని దేశాయ్ తిప్పారెడ్డి లాడ్జ్ లోని రూమ్ నెంబర్ 103 లో పేకాట జరుగుతోందని వచ్చిన పక్కా సమాచారం మేరకు.. జరిపిన దాడుల్లో భారీగా నగదు పట్టు పడటం స్థానికంగా సంచలనం కలిగించింది.