• Neti Charithra

Breaking.. మదనపల్లె లో మరో దారుణం.. ప్రేమించి..పెళ్లి చేసుకున్న భర్తే.. భార్యను చంపేశాడు..!


Breaking.. మదనపల్లె లో మరో దారుణం.. ప్రేమించి..పెళ్లి చేసుకున్న భర్తే.. భార్యను చంపేశాడు..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో విషాదం చోటుచేసుకుంది. పెళ్ళి ఆయిన ఆరు మాసాలకే ఓ నవ వధువు అనుమానాస్పద స్థితి లో మృతి చెందింది. అయితే భర్తే ఆమెను చంపి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల

కథనం మేరకు.. మదనపల్లె లో నిరుగట్టువారిపల్లె కు చెందిన



(మదనపల్లె లో పోలీసులు విచారిస్తున్న దృశ్యం)


రామాంజనేయులు తిరుపతి కి చెందిన ఉమాదేవి ఆరు మాసాలు క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే నవ వధువు ఉమ అనుమానాస్పద స్థితి లో ఇంట్లో మృతి చెందింది. ఇంట్లో భర్తే ఉరివేసి తమ బిడ్డను గొంతుకు ఉరివేసి తమ బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిం చే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన భార్య ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసిన రామాంజనేయులు ఆతర్వాత ఆదృశ్యం అయ్యాడు. దింతో అతనిపై అనుమానాలు బలపడుతున్నాయి.

స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు