• Neti Charithra

Breaking..మదనపల్లె లో పోలీసుల దాడులు.. గంజాయి వ్యాపారులు అరెస్ట్..!


Breaking..మదనపల్లె లో పోలీసుల దాడులు.. గంజాయి వ్యాపారులు అరెస్ట్..!మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె టూ టౌన్ పోలీసులు దాడులు చేసి గంజాయి అమ్మకాలు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. సీఐ నరసింహులు కథనం మేరకు.. మదనపల్లె పట్టణం లో గంజాయి అమ్మకాల పై నిఘా పెట్టిన టూటౌన్ ఎస్ ఐ వంశిధర్ సిబ్బంది తో కలిసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 244 గ్రాముల గంజాయి ని స్వాధీనం చేసుకొని మదనపల్లె మండలం గంగన్నగారి పల్లె కు చెందిన ముని వెంకటప్ప, లక్ష్మయ్య లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు.