• Neti Charithra

Breaking.. మదనపల్లె లో పూజలు..చేసి కోటీశ్వరులను చేస్తామంటూ..మోసాగించిన ముఠా అరెస్ట్..!


Breaking.. మదనపల్లె లో

పూజలు..చేసి కోటీశ్వరులను చేస్తామంటూ..మోసాగించిన ముఠా అరెస్ట్..!
మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో పూజల పేరుతో అమాయకమైన ప్రజలను దోచుకుంటున్న రాజస్థాన్‌కు చెందిన నకిలీ స్వామీజీ ముఠాను గురువారం తాలుకా పోలీసులు అరెస్ట్‌ చేశారు.దీనికి సంబంధించి స్థానిక తాలుకా పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ రవిమనోహరాచారి

(మదనపల్లె లో నకిలీ పూజారులు ను అరెస్ట్ చేసిన పోలీసులు)


మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన ఆరుగురు గుర్తుతెలియని వ్యక్తు ఒక ఎర్టిగా కారులో వచ్చి రామాయణం మురళి,రామాయణం విశ్వనాథ్‌ అనే వారిని కలిసి మేము స్వామీజీం మీ దగ్గర ఉండే తులసి పూసల బంగారు మాలలు తీసి పూజలు చేస్తామని,దీంతో మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మించి,మేము పూజలు చేసేటప్పుడు మీరు ఉండకూడదని 56 గ్రాముల బంగారు పూసమాలలతో (రూ.2,52,000 విలువైన) ఉడాయించారు.దీంతో బాధితులు

తాలుకా పోలీస్‌ స్టేషన్‌ ను ఆశ్రయించారు.దీనిపై కేసు నమోదు చేసి తాలుకా సీఐ శ్రీనివాసులు,ఎస్‌.ఐ.దిలీప్‌ కుమార్‌లు రెండు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.పక్కాగా అందిన సమాచారంతో గురువారం ఎస్‌.ఐ. దిలీప్‌ కుమార్‌ సీఐ శ్రీనివాసులు ఆదేశాల మేరకు కర్ణాటక,కోలార్‌ జిల్లా,రాయల్పాడు మండల౦,మదనపల్లె - బెంగళూరు రహదారి ప్రక్కన ఆంజనేయస్వామి గుడి వద్ద స్వామీజీ వేషంలో ఉన్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారన్నారు.వారి వద్ద నుండి రెండు బంగారు తులసి మాలలు,రాజస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన ఎర్టిగా కారును,ప్రజలను పూజల పేరుతో మోసం చేసి సంపాదించిన 72,970 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.రాజస్థాన్‌కు చెందిన జుజహర్‌ నాథ్‌ (55),భన్వర్‌ నాథ్‌ (32),హిరనాథ్‌ (42),చులునాథ్‌ (43),లడ్డు నాథ్‌ (26),దినేష్‌ నాథ్‌ (26)లు ఒక బృందంగా ఏర్పడి మోసాలకు పాలుపడే వారన్నారు. ముద్దాయిలను రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.ఈ సంఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్‌.ఐ.దిలీప్‌ కుమార్‌,హెడ్‌కానిస్టేబుల్‌ జగదీష్‌,కానిస్టేబుల్స్‌ బాలాజీ,ప్రభాకర్‌,కుడుం రమణలను డీఎస్పీ అభినందించారు.ఈ కార్యక్రమంలో రూరల్‌ సీఐ అశోక్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్