• Neti Charithra

Breaking..మదనపల్లె లో పట్టుపడిన టపాసులు రూ.60 వేల..రూ 6 లక్షల..!


Breaking..మదనపల్లె లో పట్టుపడిన టపాసులు రూ.60 వేల..రూ 6 లక్షల..!మదనపల్లె: నేటి చరిత్ర(మదనపల్లె లో పెద్దఎత్తున పట్టుపడ్డ టపాసులు)చిత్తూరు జిల్లా మదనపల్లె లో అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల భారీ నిల్వలను పోలీసులు దాడులు చేసి సీజ్ చేశారు.

మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీలోని కొత్తఇండ్లలో ఓ ఇంట్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ ఉంచిన

బాణసంచాను స్పెషల్‌బ్రాంచి పోలీసులు శుక్రవారం రాత్రి

పట్టుకుని రూరల్‌ పోలీసులకు

అప్పగించారు. స్థానికంగా ఉన్న మంజునాథ్‌పై కేసు నమోదు చేసి విచారణ

చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

జన సంచారం అధికంగా ఉన్న నివాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన టపాసుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6లక్షలు దాకా ఉంటుంది అన్న పోలీసులు కేసు నమోదు సమయానికి కేవలం రూ.60 వేలు మాత్రమే ఉంటుందని ప్రకటించడం కొసమెరుపు.