- Neti Charithra
Breaking.. ఇద్దరు యువతుల దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ..మదనపల్లె ప్రజలు..!
Updated: Jan 25
Breaking.. ఇద్దరు యువతుల దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ..మదనపల్లె ప్రజలు..!
మదనపల్లె:(ప్రత్యేక ప్రతినిథి)
(మదనపల్లె లో క్షుద్రపూజలు పేరుతో ఇద్దరు యువతులు దారుణ హత్యకు గురైన దృశ్యం)
క్షుద్రపూజలు పేరుతో కన్న బిడ్డలనే దారుణంగా హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఆదివారం
సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
శివాలయం సమీపం లో నివాసం ఉంటున్న
మదనపల్లె మహిళా డిగ్రీ కళాశాల వైస్
ప్రిన్సిపాల్ పురుషోత్తం నాయుడు- పద్మజ (ప్రయివేటు విద్యాలయం ప్రిన్సిపాల్) లు
(దారుణ హత్యకు గురైన ఇద్దరు యువతులు)
కు ఇద్దరు ఆడపిల్లలుదివ్య(22), అలైఖ్య (27),
ఎంబీఏ విద్య పూర్తి చేశారు. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ రహిమాన్ సంస్థ లో శిక్షణ పొందుతుండగా మరో అయ్యాయి పీజీ చేస్తోంది. ఈ నేపథ్యంలో
తల్లి తండ్రులు కు క్షుద్రపూజలు పై ఆసక్తి అధికంగా ఉండటంతో కన్న బిడ్డలు పైనే వారు క్షుద్ర పూజలు ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇద్దరు ఆడపిల్లలు పైనే వారు క్షుద్రపూజలు పేరుతో వారిని
ని దిగంబరం చేసి ఒకరిని శూలం తో పొడిచి..మరొకరిని రాగి పాత్ర నుదిటన పెట్టి ఇనుము రాతి తో హత్య చేయినట్లు అధికారులు గుర్తించారు.
హత్యా స్థలం లో రెండు గదుల్లో అచేతనంగా హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. ఒంటి పై దుస్తులు లేకుండా యువతులపై క్షుద్రపూజలు చేసినట్లు సమాచారం.స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. జంట హత్యలు పట్టణం లో కల కలం రేపాయి.