• Neti Charithra

Breaking..మదనపల్లె మెడికల్ కళాశాల స్థలాల కు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!



Breaking.. మదనపల్లె మెడికల్ కళాశాల స్థలాల కు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!


మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె లో జాయింట్ కలెక్టర్ మార్కండేయులు పర్యటించారు.

సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గ్రామా,వార్డు సచివాలయ సర్వేయర్లు భూ సర్వేలో శిక్షణ పొందుతున్న తీరు ను

(మెడికల్ కళాశాల స్థలాలు పరిశీలిస్తున్న జేసీ మార్కెన్ డేయులు, సబ్ కలెక్టర్ జాహ్నవి)


పరిశీలించారు.భూ సర్వేలో ఎలా సర్వే చేస్తారు అనే వివరాలను , వారు చేస్తున్న ప్రాక్టికల్ ను సబ్ కలెక్టర్ తో కలిసి పరిశీలించారు.



(గ్రామ సచివాలయం లో రికార్డులు పరిశీలిస్తున్న జేసీ మార్కెన్ డేయులు)


మధ్యాహ్నం మునిసిపాలిటీ పరిధిలోని రామారావు స్కూల్ నందు వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసి వార్డు సచివాలయం లో ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సేవలు సక్రమంగా ప్రజలకు సకాలంలో అందిస్తున్నారా, లబ్దిదారుల జాబితాలను నోటిసు బోర్డు మీద ఏర్పాటు చేస్తున్నారా, బయోమెట్రిక్ ను ఉపయోగిస్తున్నారా, రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని పరిశీలించి అర్హులైన వారికీ రేషన్ కార్డులు పంపిణి చేస్తున్నరా, పించన్లు సకాలం లో అందజేస్తున్నారా అనే వివరాలను సచివాలయ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సకాలంలో ప్రజలకు అందిస్తున్నామని, లబ్దిదారుల జాబితాను, అధికారులకు సంబందించిన ఫోన్ నంబర్లను, ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఎలా

ఉపయోగించుకోవాలనే వివరాలు కలిగిన ఫ్లెక్సీలను లను ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని జేసి గారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల తహశీల్దారు కృష్ణమోహన్, డిప్యూటీ సర్వేయర్ ముని కన్నన్, ఎంపి డి ఓ.లీలా మాధవి,డిప్యూటి తహశీల్దారు శేషయ్య, కార్యదర్శి సుశీల, ఆర్వో, పల్లవి, సర్వేయర్లు, విఆర్వోలు, సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.


549 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon