• Neti Charithra

Breaking.. మదనపల్లె మిట్స్ కళాశాల కు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. విద్యార్థులలో గందర గోళం..!


Breaking.. మదనపల్లె మిట్స్ కళాశాల కు భారీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. విద్యార్థులలో గందర గోళం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఇంజనీరింగ్ కళాశాల(Mits) కు ఏపీ ప్రభుత్వం షాక్ .. ఇచ్చింది. జూన్ లో జరగాల్సిన ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశాలు లాక్ డౌన్ కారణం గా డిసెంబర్ 28 న కళాశాలల వెబ్ కౌన్సిలింగ్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో



( మిట్స్ విద్యార్థులకు ఫీజ్ రీ అంబర్స్ మెంట్ లేందంటూ ప్రకటించిన ప్రభుత్వం)


సోమవారం ఇంజనీరింగ్ ప్రవేశాలకు జరగాల్సిన వెబ్ కౌన్సిలింగ్ లో మదనపల్లె కు చెందిన మిట్స్ కళాశాలలో ప్రవేశం కోరే ఇంజనురింగ్ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్ మెంట్ చెల్లించదని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు వెబ్ సైట్ లో పెట్టడంతో విద్యార్థులు ఖంగు తిన్నారు. విద్యా ప్రమాణాలు విషయం లో రాయలసీమ లో గుర్తింపు పొందిన ఈ కళాశాల లో ప్రవేశం కోరేందుకు విద్యార్థులు మక్కువ చూపుతుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయం తో ఈ కళాశాలలో చేరేందుకు ఉత్సహంగా ఉన్న విద్యార్థులు షాక్ కు గురయ్యారు. వాస్తవానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాల లో చేరే విద్యార్థుల కళాశాల ల ఫీజ్

రియంబర్స్ మెంట్ మొత్తం రూ.69800లు గా నిర్ణయించడం తో ఈ నిర్ణయం పై మిట్స్ కళాశాల యాజమాన్యం ఇటీవల హైకోర్టు ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం తో విద్యార్థుల తో పాటు తల్లి తండుల లో గందర గోళాన్ని సృష్టిస్తోంది.