• Neti Charithra

Breaking.. మదనపల్లె పట్టణ నడి బొడ్డున అగ్నిప్రమాదం..కారు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం..!


Breaking.. మదనపల్లె పట్టణ నడి బొడ్డున అగ్నిప్రమాదం..కారు దగ్ధం.. తప్పిన ప్రాణాపాయం..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లో అగ్నిప్రమాదం కలకలం రేపింది. సిటీఎం రోడ్ లోని ఏ ఎస్ ఆర్ సినిమా థియేటర్ వద్ద ఆదివారం సాయంత్రం పార్కింగ్ చేసిన కారులో మంటలు ఎగిసి పడటం తో

స్థానికులు ఉలిక్కి పడ్డాడు. తంబల్లపల్లి ఏపీఎం మురళి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ కు వచ్చి సిటీఎం రోడ్ లో కారు ను పార్కింగ్ చేశారు. కొద్ది క్షణాల లోనే కారు లో మంటలు రాగ సమాచారం అందుకున్న అగ్నిమాపక వాహనం అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం జరిగినపుడు కారులో ఎవరూ లేక పోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తో స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.