• Neti Charithra

Breaking.. మదనపల్లె నుంచి విశాఖ పట్నం కు చేరిన.. జంట హత్యల కేసు ..!


Breaking.. మదనపల్లె నుంచి విశాఖ

పట్నం కు చేరిన.. జంట హత్యల కేసు ..!విశాఖపట్నం:నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రల్లో సంచలనం కలిగించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసు నిందితులను ఎట్టకేలకు పోలీసులు విశాఖ పట్నం మానసిక వైద్యశాలలో గురువారం ఉదయం చేర్చారు. ఇద్దరు

పిల్లల దారుణ హత్య కేసులో

మదనపల్లె సబ్ జైలు లో

14 రోజుల రిమాండ్ లో ఉన్న పురుషోత్తం నాయుడు, పద్మజ లు రాత్రి వేళల్లో అరుపులు, కేకలు కారణంగా తోటి ఖైదీలు, సబ్ జైలు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో తిరుపతి రుయా వైద్యులు సలహా మేరకు.. ఇద్దరు

నిందితులను బుధవారం ప్రత్యేక పోలీస్ సిబ్బంది బందోబస్తు మధ్య తీసుకెళ్లగా గురువారం ఉదయం విశాఖ మానసిక వైద్యశాల కు ఎట్టకేలకు తరలించారు. కాగ నిందితులకు వైద్యం అందే వరకు చిత్తూరు జిల్లా పోలీసులు విశాఖ లోనే కొనసాగేలా సిబ్బందికి ఆదేశాలు అందినట్లు సమాచారం