• Neti Charithra

Breaking... మదనపల్లె నుంచి ముంబయికి ఇక నేరుగా రైలు వసతి !


Breaking... మదనపల్లె నుంచి ముంబయికి ఇక నేరుగా రైలు వసతి

!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె నుంచి ముంబాయి కి రైలు వసతి కల్పిస్తున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. డిసెంబర్ 7 నుంచి ప్రారంభం అయ్యే రైలు వారం లో నాలుగు రోజుల పాటు రాక పోకలు సాగిస్తుందని ..

దక్షిణ మధ్య రైల్వేశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని సీటీఎం రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ రెడ్డిప్రసాద్‌ పేర్కొన్నారు. వారానికి నాలుగు రోజులపాటు నడిచే ఈ రైలు నాగర్‌కోయిల్‌ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి కాట్పాడి, చిత్తూరు, పాకాల, పీలేరు మీదుగా మదనపల్లెకు రాత్రి 11.08కు వచ్చి కదిరి మీదుగా మరుసటి రోజు రాత్రి 7.15 ముంబయికి చేరుకుంటుంది. ముంబయి

నుంచి రాత్రి 8.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మదనపల్లె రోడ్డుకు (సీటీఎం రైల్వేస్టేషన్‌కు) మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు వినియోగించుకోవాలని వారు కోరారు.