- Neti Charithra
Breaking.. మదనపల్లె నుంచి అజ్మీర్ కు వెళుతున్న భక్తుల కు రోడ్డు ప్రమాదం .14 మంది మృతి..!
Breaking.. మదనపల్లె నుంచి
అజ్మీర్ కు వెళుతున్న భక్తుల కు రోడ్డు ప్రమాదం
.14 మంది మృతి..!
మదనపల్లె: నేటి చరిత్ర
భక్తులు మృతి చెందిన ఘటన పెను విషాదాన్ని నింపింది. వివరాలు..కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 18 మంది ప్రయాణికులతో
కూడిన టెంపో వాహనం మదనపల్లి నుంచి అజ్మీర్ వెళ్తుండగా కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని మాదపురం వద్ద
ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
( ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు)
తీవ్రంగా గాయపడిన నలుగురిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు ఒక చిన్నారి ఉన్నారు. మృతులంతా మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
1,661 views0 comments