• Neti Charithra

Breaking.. మదనపల్లె డివిజన్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కి మండలాలు ఖరారు చేసిన ప్రభుత్వం..!


Breaking.. మదనపల్లె డివిజన్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కి మండలాలు ఖరారు చేసిన ప్రభుత్వం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ డివిజన్ పరిధి లో ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో 12 చోట్ల

శనివారం నుంచకోవిడ్ వ్యాక్సిన్ టీకాలు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మదనపల్లె డిప్యూటీ డిఎంహెచ్ ఓ లోక వర్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ

కోవిడ్ వాక్సినేషన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో

పంపిణీ జరుగుతుందన్నారు.

నియోజకవర్గ పరిధిలోని ఎంపిక చేయబడిన టీకా కేంద్రాలలో సంబంధించిన నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు కార్యక్రమాన్ని

ప్రారంభిస్తారని తెలిపారు. మదనపల్లె పరిధిలో మొత్తం ఆరు నియోజకవర్గ పరిధిలో 12 టీకా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో గుడుపల్లి 145, శాంతిపురం 107,పి.హెచ్.సి లలో,పలమనేరు నియోజకవర్గ పరిధిలో పెద్ద పంజాని184,గంగవరం 105 పి.హెచ్.సి లలో,పుంగనూరు నియోజకవర్గ పరిధిలో చౌడేపల్లి144, సోమల 107 పి.హెచ్.సి లలో,మదనపల్లె నియోజకవర్గ పరిధిలో మదనపల్లె ప్రభుత్వ ఆస్పతి లోని పి.పి.యూనిట్ 335 మరియు నిమ్మనపల్లి 126 పి.హెచ్.సి లలో,తంబళ్ళ పల్లి నియోజకవర్గ పరిధిలో కరబల కోట175,పి.టి.ఎమ్. 153 ఆరోగ్య కేంద్రాలలో, పిలేరు నియోజకవర్గ పరిధిలోని కలకడ186, గుర్రంకొండ 156 పి.హెచ్.సి లలో మొత్తం ఐదు రోజుల్లో 1923 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి కోవిడ్ వ్యాకిసిషన్ వేయడం జరుగుతుంది అన్నారు.రేపు ఉదయం 10.30ని లకు కోవిడ్ టీకాలు మొదటి దశలో ఆరోగ్య సంరక్షకులకు 16.1.2021 నుండి 20.1.2021 తేదీ వరకు రోజుకు 100 మందికి చొప్పున ఇవ్వడం జరుగుతుంది అన్నారు. రేపు టీకా తీసుకున్న వారు మళ్ళీ 28 రోజుల తర్వాత రెండవ మోతాదు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.కేంద్ర మార్గదర్శకాల ప్రకారం గర్భిణులు, పాలిచ్చు తల్లులు,18 సం లోపు పిల్లలకు ,ఫుడ్ అలెర్జీ ఉన్న వాళ్లకు టీకా ఇవ్వడం జరగదని తెలిపారు. డివిజన్ పరిధిలో 6 నియోజకవర్గ పరిధిలో సెషన్ సైట్స్ పరిశీలనకు 6 మంది నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ను నియమిచడం జరిగింది అని తెలిపారు.ప్రతి సెషన్ సైట్ లో అత్యవసర పరిస్థితి కొరకు 108 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది అన్నారు.తొలి దశలో ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, రెండవ దాడిలో ఫ్రంట్ లైన్ సిబ్బందికి, మూడవ దశ లో 50 సం పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు.టీకా తీసుకునే లబ్ధిదారులకు ముందు రోజే ఫోన్ మెసేజ్ ఎక్కడ,ఎప్పుడు వేసుకోవాలని వస్తుందని, తిరిగి రెండవ మోతాదు కు ఎప్పుడు రావాలని కూడా

తెలుపుతూ సమాచారం మేసేజ్ వస్తుందని తెలిపారు. టీకా తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది అన్నారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక నోడల్ అధికారులు డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్(కుప్పం)డాక్టర్ మల్లి కార్జున రెడ్డి (పలమనేరు)డాక్టర్ రాజశేఖర్ రెడ్డి(పుంగనూరు)డాక్టర్ అనుపమ(మదనపల్లె)డాక్టర్ అభిలాశ్(తంబళ్ళ పల్లి)డాక్టర్ శేషగిరి బాబు(పిలేరు) హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ,పర్యవేక్షకులు శ్రీనివాస్, సి.హెచ్.ఓ లు విజేశ్వర రావు,వెంకటరమణ, కలీల్,వెంకటేష్,ఆది,భాస్కర్ ,అమర్ తదితరులు పాల్గొన్నారు