• Neti Charithra

Breaking.. మదనపల్లె జంట హత్య కేసులో .. సంచలన విషయాలు చెప్పిన తల్లి తండ్రులు..!


Breaking.. మదనపల్లె జంట హత్య కేసులో .. సంచలన విషయాలు చెప్పిన తల్లి తండ్రులు..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో సంచలనం కలిగించిన అలైఖ్య, సాయి దివ్యల

క్షుద్రపూజల ..పేరుతో జరిగిన

జంట హత్యలు ..ఘటన లో తల్లి తండ్రులు.. సంచలన వ్యాఖ్యలు చేయడం.. కల కలం గా మారింది. శివాలయం సమీపం లోని ఓ ఇంట్లో ఉంటున్న మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పురుషోత్తంనాయుడు- మాస్టర్ మైండ్ విద్యాలయం ప్రిన్సిపాల్ పద్మజ లు తమ కుమార్తెలు ఆయిన పీజీ చేస్తున్న

అలైఖ్య, ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఆర్ రహిమాన్ సంస్థ లో మ్యూజిక్ నేర్చుకుంటున్న

సాయి దివ్య లను క్షుద్ర పూజలు పేరుతో వారిని దిగంబరం చేసి ఇంట్లోనే దారుణ హత్య చేయడం తో పట్టణ ప్రజలు ఉలిక్కి పడిన విషయం తెలిసిందే. ఘటనా స్థలాన్ని మదనపల్లె డిఎస్పీ రవి మనోహర చారి సీఐ నరసింహులు పరిశీలించారు. అయితే పోలీసుల విచారణ లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. తమ బిడ్డలు 24 గంటల్లో మళ్ళీ ప్రాణం పోసుకుంటారని తల్లి తండ్రులు పోలీసుల విచారణ లో పేర్కొనడం సంచలనంగా మారింది.

కాగనిన్నటి వరకు అందరితో కలుపు గోలుగా ఉంటున్న పురుషోత్తం నాయుడు, పద్మజ లు కన్న పిల్లలను అతి దారుణంగా హత్య చేసిన తీరును స్థానికులు జీర్ణించుకోలేక పోతున్నారు.వాస్తవానికి గత ఏడాది మార్చి 24 నుంచి ఆయింట్లోకి బయటి వ్యక్తుల ను ఆ దంపతులు రానివ్వలేదని తెలుస్తోంది. కొంత కాలం గా నిత్యం క్షుద్రపూజలు కు వారు అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు.

తాజా ఘటన లు తో పట్టణ ప్రజలు ఇలాంటి విషాద ఘటనలు మరెన్ని జరుగుతాయో నాని భయంతో ఆందోళన చెందుతున్నారు.