• Neti Charithra

Breaking...మదనపల్లె జంట హత్య కేసులో కొత్తకోణం.. నిందితులతో మాట్లాడిన న్యాయవాది..!


Breaking...మదనపల్లె జంట హత్య కేసులో కొత్తకోణం.. నిందితులతో మాట్లాడిన న్యాయవాది..!


మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో సంచలనం కలిగించిన జంట హత్యల కేసు మరో మలుపుకు నాంది పలికే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కల కలం రేపిన అక్కా చెల్లెళ్ళ (ఆలేఖ్య, సాయి దివ్య) హత్య లో తల్లి తండ్రులు పురుషోత్తం నాయుడు, పద్మజ లను విశాఖ కు

తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో శనివారం హైదరాబాదు కు చెందిన ఓ మహిళా న్యాయవాది నిందితుడు పురుషోత్తం నాయుడు తో

మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పురుషోత్తం నాయుడుతో భేటీ ఆయిన మహిళా న్యాయవాది రజిని మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదు లో ప్రముఖ న్యాయ వాది కృష్ణమ చార్య సూచన మేరకు జంట హత్య కేసులో నిందితులను


( జంట హత్య కేసు లో కొత్తకోణం అంటున్న న్యాయవాది రజని)


కలిసేందుకు వచ్జినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జంట హత్య కేసులో పలు అనుమానాలు ఉన్నాయని ఈ హత్యలకు క్షుద్ర పూజలకు సంబంధం లేదని ఆమె పేర్కొనడం పలు అనుమానాలు కు తావిస్తోందన్నారు. ఈ కేసులో బయటి ప్రపంచానికే తెలియని విషయాలు చోటు చేసుకున్నాయని ఆమె పేర్కొనడం విశేషం.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్