• Neti Charithra

Breaking.. మదనపల్లె జంట హత్యల కేసు లో నిందితులను భారీ భద్రత మధ్య తరలింపు..!


Breaking.. మదనపల్లె జంట హత్యల కేసు లో నిందితులను భారీ భద్రత మధ్య తరలింపు..!



మదనపల్లె: నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన

చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్య కేసు నిందితులను మానసిక వైద్యం కోసం బుధవారం విశాఖ పట్నం

కు బందోబస్తు మధ్య తరలించారు.

భక్తి తత్వంలో పడి కన్నబిడ్డలన చంపిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయడు లు ను పోలీసులు మరింత విచారణ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మదనపల్లె సబ్ జైలు లో రాత్రి వేళల్లో పద్మజ అరుపులు కేకలు తో తోటి ఖైదీలకు ఇబ్బందికరంగా మారటం తో ఎట్టకేలకు కోర్టు ఆదేశాలు తో



( జంట హత్య ల కేసు నిందితులను విశాఖకు తరలిస్తున్న పోలీసులు)

వైద్యా పరీక్షల నిమిత్యం కోసం విశాఖపట్నం మానసిక వైద్యశాలకు తరలించాలని తిరుపతి రుయా వైద్యుల సూచనలు మేరకు.. మదనపల్లి సబ్ జైల్ లో ఉన్న పద్మజ, పురుషోత్తం నాయడు లను చిత్తూరు నుంచి వచ్చిన ఏఆర్ పోలీసులు వారిని ప్రత్యేక వాహనంలో తీసుకుని వెళ్ళారు. ఏఆర్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ముగ్గురు, సివిల్ ఉమన్ పోలీసులు ఇద్దరు వారికి రక్షణగా వెళ్లారు. ‌