• Neti Charithra

Breaking.. మదనపల్లె ఇండస్టియల్ ఏరియాలో పోలీసుల దాడులు..భారీగా గంజాయి పట్టివేత..నలుగురు అరెస్ట్!


Breaking.. మదనపల్లె ఇండస్టియల్ ఏరియాలో పోలీసుల దాడులు..భారీగా గంజాయి పట్టివేత..నలుగురు అరెస్ట్!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె లో టూటౌన్ పోలీసులు ఇండస్టియల్ ఎస్టేట్ ఏరియా లో దాడులు చేశారు. ఈ సందర్భంగా బయటి

ప్రాంతాల నుంచి గంజాయి ని

తెచ్చి పట్టణం లో విక్రయిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి నట్లు టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ ఐ వంశిధర్ లు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పరిసరాల్లో టూటౌన్ పోలీసులు దాడులు

చేయగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 3142 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని షేక్ సంషీర్, కావేరి తనుష్,వాసు, మహబూబ్ బాషా లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ నరసింహులు మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు చేసే వారి వివరాలు తెలిస్తే ధైర్యంగా తమదృష్టికి తేవాలని సీఐ నరసింహులు పేర్కొన్నారు.