• Neti Charithra

Breaking...మత్సకారుల పడవ మునిగి ఒకరు మృతి.. పలువురికి తృటిలో తప్పిన ప్రమాదం..!Breaking...మత్సకారుల పడవ మునిగి ఒకరు మృతి.. పలువురికి తృటిలో తప్పిన ప్రమాదం..!శ్రీకాకుళం: నేటి చరిత్ర


శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్‌జీఆర్ పురం గ్రామంలో మత్యకారులు తెల్లవారుజామున వేటకు వెళ్లిన సమయంలో అలలు ఎక్కువగా రావడంతో బోటు బోల్తా పడిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదం లో

బోటులో ఉన్నవారు అందరూ సముద్రంలో పడిపోయారు. ఒక వ్యక్తి మాత్రం బోటులో చిక్కుకోని మరణించినట్లు మిగతా వారు తెలిపారు. ఇంకా మరణించిన వ్యక్తి ఆచూకీ దొరకకపోవడంతో...  ఆ వ్యక్తి  కోసం పెద్ద ఎత్తున బోట్లు వలలు సాయంతో గాలింపు

చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, సముద్రం దగ్గరకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మరణించిన వ్యక్తి పేరు మైలపల్లి అమ్మోరు(30). ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.