• Neti Charithra

Breaking.. మడత మంచానికి కట్టేసి... తల పగుల గొట్టి..దారుణ హత్య..!


Breaking.. మడత మంచానికి కట్టేసి... తల పగుల గొట్టి..దారుణ హత్య..!


నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


ఓ వ్యక్తిని మంచానికి కట్టివేసి.. దారుణ హత్యకు పాల్పడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం కలిగించింది.

పోలీసులు కథనం మేరకు.. పిఠాపురం పట్టణంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానం ఆలయం ఎదురువీధిలో నివాసముంటున్న రెడ్డెం శ్రీనివాసరావు(46)ఇంట్లోని ఓ గదిలో పడుకున్నాడు. పక్క గదిలో నిద్రించిన

భార్య స్వరూపరాణి సోమవారం ఉదయం లేచి చూసే సరికి శ్రీనివాస్‌ మడత మంచానికి తాళ్లతో కట్టేసిన స్థితిలో, తల నుజ్జయి మృతి చెంది ఉన్నాడు ఇదివరకే శ్రీనివాస్‌ మొదటి భార్య మృతి చెందడంతో స్వరూపరాణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు, రెండో భార్యకు ఒక బాబు ఉన్నారు. వీరంతా ఓకే ఇంట్లో ఉంటున్నారు.డీఎస్పీ భీమారావు, సీఐ రామచంద్రరావు, ఎస్సై శంకరరావు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ హత్య జిల్లా లో కల కలం రేపింది.

599 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon