• Neti Charithra

Breaking... భారీ వర్షం.. వాగులు లో కొట్టుకుపోయిన కారు..చిత్తూరు జిల్లాలో ఇద్దరు గల్లంతు..!


Breaking... భారీ వర్షం.. వాగులు లో కొట్టుకుపోయిన కారు..చిత్తూరు జిల్లాలో ఇద్దరు గల్లంతు..!



చిత్తూరు: నేటి చరిత్ర

చిత్తూరుజిల్లా లో ఒక్కసారిగా కురిసిన

వర్షాలకు ఇద్దరు గల్లంతు ఆయిన ఘటన చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి

కురిసిన భారీ వర్షం కారణంగా పెనుమూరు మండలం కొండయ్యగారిపల్లె వంక

ఉధృతంగా ప్రవహించింది. ఈ ప్రవాహంలో కారు కొట్టుకుపోయి ఇద్దరు గల్లంతు అయ్యారు.పెళ్లికి వెళ్లిన నలుగురు తిరిగి కారులో వస్తుండగా... నిన్న అర్థరాత్రి సుమారు 12 గంటలకు కొండయ్యగారిపల్లె వంకను దాటుతుండగా.. వంక ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్య, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడగా, తండ్రి, కూతురు

గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వీరంతా పూతలపట్టు మండలం ఒడ్డుపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గల్లంతయిన ఇద్దరి కోసం రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. గాలింపు చర్యలు చేపట్టారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్