- Neti Charithra
Breaking... భారీ భద్రత మధ్య రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు మదనపల్లె పర్యటన...!
Breaking... భారీ భద్రత మధ్య రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేడు మదనపల్లె పర్యటన...!
మదనపల్లె: నేటి చరిత్ర
భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కొవింద్ మదనపల్లె, సదుం లలో పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ తెలిపారు. మదనపల్లె బిటి కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, చిప్పిలి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లలో చేసిన ఏర్పాట్లు, సత్సంగ్ ఫౌం డేషన్ లో రాష్ట్రపతి పర్యటనలో భాగంగా సందర్శించే అన్ని ప్రాంతాలను
పరిశీలించారు. భద్రతా పరంగా, ఏర్పాట్లలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా అధికారులందరూ వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ తో ఎస్.పి సెంథిల్ కుమార్, జాయింట్ కలెక్టర్లు (రెవెన్యూ, అభివృద్ధి) డి. మార్కండేయులు, వి.వీరబ్రహ్మం, మదనపల్లె సబ్ కలెక్టర్ ఎం.జాహ్నవి, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి ఎస్ ఇ లు అమరనాథ రెడ్డి, దేవా నందం, డి ఎస్ పి రవిమనోహరాచారి, ఇతర అధికారులు
పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సదుం పీపల్ గ్రోవ్ స్కూల్ లో రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లలో భాగంగా హెలిప్యాడ్, ఇతర పర్యటన ప్రాంతాలను పరిశీలించి, అధికారులందరూ అప్ర మత్తంగా ఉండి రాష్ట్రపతి పర్యటన ను విజయవంతం చేయాలని కోరారు.