• Neti Charithra

Breaking.. భారీగా లంచం తీసుకుంటూ .. ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ అధికారి..!


Breaking.. భారీగా లంచం తీసుకుంటూ .. ఏసీబీ కి చిక్కిన పంచాయతీ రాజ్ అధికారి..!



మచిలీపట్నం: నేటి చరిత్ర


అవినీతి కి పాల్పడుతున్న పంచాయతీ

శాఖ అధికారి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డ ఘటన మచిలీపట్నం సమీపం లో చోటు చేసుకుంది. ఏసీబీ డిఎస్పీ శరత్‌బాబు కథనం మేరకు.. పెడన మండలంలో పంచాయతీరాజ్‌ ఏఈగా పనిచేస్తున్న బీవీఎన్‌ ప్రసాద్‌ మచిలీపట్నంలో నివాసం ఉంటున్నారు. పెడన మండల పరిధిలో పెనుమల్లి గ్రామానికి చెందిన ఎం.బాలసుబ్రహ్మణ్యం రూ.75 లక్షల అంచనా విలువున్న సచివాలయ భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. బేస్‌మెంట్‌ స్ధాయికి పని పూర్తి కావడంతో అంతవరకూ బిల్లు రూ.21 లక్షలు చెల్లించేందుకు ఏఈ ప్రసాద్‌ రూ.1.50 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం రూ.85 వేలు చెల్లించేలా ఏఈతో మాట్లాడుకొని మచిలీపట్నంలోని ఆయన నివాసగృహంలో

నగదు తీసుకున్న అధికారినిఏసీబి అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు కు తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్