• Neti Charithra

Breaking...భారీగా పోలీసుల మోహరింపు..బోయకొండ లో ఉద్రిక్తత..!



Breaking...భారీగా పోలీసుల మోహరింపు..బోయకొండ లో ఉద్రిక్తత..!



పుంగనూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.




బోయకొండ ఆలయ కార్యాలయం పక్కన 1995లో మూడు కుటుంబాలకు

ప్రభుత్వం డికెటి పట్టాలు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో వారు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇటీవల ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఆదివారం ఈ మూడు ఇండ్లు కూడా

అధికారులు నాలుగు జేసీబీ లతో

తొలగించారు. ఇల్లు కూల్చివేసిన ముగ్గురికి నష్టపరిహారంగా 70 లక్షల రూపాయలు చెల్లించాలి ఆర్ అండ్ బి మరియు రెవిన్యూ

అధికారులు ప్రతిపాదించారు .కానీ కొద్ది రోజులకే 70 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని 35 లక్షల కు తగ్గించడంతో లబ్ధిదారులు అంగీకరించలేదు దీనిపై హైకోర్టు వెళ్లగా హైకోర్టు బాధితులకు 70 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి హౌసింగ్ ఇల్లులు ఇవ్వాలని ఆదేశించారు .

తాజా గా ఈ రోజు వంద మంది పోలీసులు

అక్కడికి చేరుకొని బలవంతంగా ఇంటి

సా మానులు ఓ మినీ లారీ లో వేయించి గృహాలను బలవంతంగా తొలగించారు. ఈ తొలగింపు కార్యక్రమం లో పలువురు వైసీపీ నాయకులు పాల్గొనడం తో పరిస్థితి వివాదంగా మారింది. ఆ ప్రక్రియను అడ్డుకున్న వారిని చౌడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించడం తో ఈ ఘటన పెను వివాదంగా మారింది.