• Neti Charithra

Breaking.. భూకబ్జా కు పాల్పడిన మంత్రి పై కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. భూకబ్జా కు పాల్పడిన మంత్రి పై కేసు నమోదు చేసిన పోలీసులు..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)



తెలంగాణా కు చెందిన మంత్రి మల్లారెడ్డి పై పోలీసులు భూకబ్జా కేసు నమోదు చేశారు. కుత్బుల్లా పూర్ మండలం సూరారం గ్రామంలో 2 ఎకరాల 13 కుంటల భూమిలో కొంత భాగాన్ని కబ్జా చేశారంటూ శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


తన లాయర్ మల్లారెడ్డికి అమ్ముడు పోయి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను బెదిరిస్తున్నారని శ్యామల పోలీసులకు తెలిపారు. ఇరవై కుంటల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మంత్రి మల్లారెడ్డితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.