• Neti Charithra

Breaking... బీసీ కార్పొరేషన్ల కు తీపి కబురు.." బీసీ ల సంక్రాంతి" కి భారీ ఏర్పాట్లు..!


Breaking... బీసీ కార్పొరేషన్ల కు తీపి కబురు.." బీసీ ల సంక్రాంతి" కి భారీ ఏర్పాట్లు..!


నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన

బీసీ కార్పొరేషన్ల పాలక

కమిటీలు ఈ నెల 17 న ప్రమాణ స్వీకరోత్సవం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ నగరపాలక సంస్థ (ఐజీఎంసీ) స్టేడియంలో ఈ నెల 17వ తేదీన ‘బీసీల సంక్రాంతి’ పేరిట 56 బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మంత్రులు పేర్ని వెంకట్రామ య్య (నాని), వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

హాజరుకానున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌ తదితరులతో కలిసి మంత్రులు పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 139 వెనుకబడిన కులాలను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, జేసీలు డాక్టర్‌ కె.మాధవిలత, కె.మోహన్‌కుమార్‌, వైకాపా నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్