- Neti Charithra
Breaking.. బ్యాంక్ ఉద్యోగిని స్నేహ లత హత్య కేసు లో ఇద్దరు నిందితులు అరెస్ట్..!
Breaking.. బ్యాంక్ ఉద్యోగిని స్నేహ లత హత్య కేసు లో ఇద్దరు నిందితులు అరెస్ట్..!
ధర్మవరం: నేటి చరిత్ర
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో స్నేహలత హత్యకు గురైన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ తెలిపారు. అనంతపురం లోని అశోక్ నగర్ కు చెందిన గుత్తి రాజేష్ (23), ఇతని స్నేహితుడు సాకే కార్తీక్ (28), అరెస్టు చేసి ఈరోజు కోర్టు ముందు హాజరు పరచనున్నామని పేర్కొన్నారు.
ఈ కేసులో గుత్తి రాజేష్ ప్రధాన నిందితుడన్నారు. ఇతని స్నేహితుడైన సాకే కార్తీక్ ప్రోద్భలం కూడా ఇందులో ఉందన్నారు. గుత్తి రాజేష్ ను ప్రేరేపించాడన్నారు. ధర్మవరం నుండి స్నేహలతను నేర స్థలం వరకు ఎక్కించుకొచ్చిన అపాచీ వాహనాన్ని, ప్రధాన నిందితుడు వినియోగించిన 3 సెల్ ఫోన్లు మరియు మరో ఫోన్ కలిపి 4 సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు.
266 views0 comments