• Neti Charithra

Breaking.. బిగ్..బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు..గ్రీన్ సిగ్నల్..!


Breaking.. బిగ్..బ్రేకింగ్.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు..గ్రీన్ సిగ్నల్..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


ఎపి పంచాయితీ ఎన్నిక‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.. ఎన్నిక‌ల‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కొట్టివేసింది. దీనిపై ఎన్నిక‌ల క‌మిష‌న్ డివిజ‌న్ బెంచ్ కు వెళ్లింది. ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో రెండ్రోజుల క్రితం వాదనలు ముగియగా.. జడ్జిమెంట్‌ రిజర్వ్‌ చేసిన హైకోర్టు ఇవాళ తీర్పు ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది వ్యాక్సినేషన్‌కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించగా.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే.. కాగా తీర్పు సంద‌ర్భంగా ఎన్నిక‌లు, ఆరోగ్యం రెండూ ముఖ్య‌మేన‌ని హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.. ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల క‌మిష‌న్ రెండూ స‌మ‌న్వ‌యంతో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను కొన‌సాగించాల‌ని సూచించింది.



795 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon