- Neti Charithra
Breaking.. కర్ణాటక మద్యం తాగి.. అనుమానాస్పద స్థితి లో బి కొత్తకోట మండల వాసి మృతి..!
Breaking..
కర్ణాటక మద్యం తాగి.. అనుమానాస్పద స్థితి లో బి కొత్తకోట మండల వాసి మృతి..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం చలిమామిడి సమీపం అటవీ ప్రాంతం లో ఓ వ్యక్తి మృత దేహాన్ని పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. గట్టు సమీపం లోని పట్ర వారిపల్లె కు చెందిన ఓ వ్యక్తి రెండు రోజుల క్రితం ఓ మేకను అమ్మి కొంత మొత్తం తో ఆంధ్రా-
కర్ణాటక సరిహద్దు కు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చలిమామిడి అటవీ ప్రాంతం లో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ అటవీ ప్రాంతాల పరిసరాల్లో నాటు సారా తయారీ జరుగుతోందని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలోఇతను కల్తీ సారా తాగి మృతి చెందినట్లు ప్రచారం కూడా జరుగుతోంది.
కాగ ఈ ఘటనపై ఎస్ ఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ మృతుడు కర్ణాటక మద్యం అతిగా తాగడం వలన మృతి చెందిఉండవచ్చని.. వివరించారు.