- Neti Charithra
Breaking.. బి కొత్తకోట వివాదం పై తీవ్రంగా స్పందించిన డిజిపి గౌతమ్ సవాంగ్..!
Breaking.. బి కొత్తకోట వివాదం పై తీవ్రంగా స్పందించిన డిజిపి గౌతమ్ సవాంగ్..!
మంగళగిరి: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లాకు చెందిన న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై దాడి కేసుకు సంబంధించి మాజీ సీఎం
చంద్రబాబు నాయుడుకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. చిత్తూరు
జిల్లా బి.కొత్తకోటలో రెండు రోజుల క్రితం
జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రతాప్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రతాప్‌రెడ్డికి పండ్ల వ్యాపారికి మధ్య దారి విషయంలో వాగ్వాదం జరుగుతుండగా వెళ్లిన రామచంద్రపై
ప్రతాప్‌రెడ్డి దాడి చేశారని తమ విచారణ లో తేలిందనిడీజీపీ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించామని
అన్నారు. వైసీపీ నేతలు పథకం ప్రకారం దాడి చేశారనే ఆరోపణలు అవావస్తమని డీజీపీ చంద్రబాబు కు పంపిన లేఖ లో
వివరించారు.
1,034 views0 comments