- Neti Charithra
Breaking.. ప్రముఖు లే..టార్గెట్ గా బి కొత్తకోట లో సైబర్ నేరగాళ్ల పంజా..!
Breaking.. ప్రముఖు లే..టార్గెట్ గా
బి కొత్తకోట లో సైబర్ నేరగాళ్ల పంజా..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట కు చెందిన ఓ విద్యా సంస్థల యజమాని పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన ఘటన
(సైబర్ నేరగాళ్ల చేతి లో మోసపోయిన బాధితులు)
వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట చైతన్య విద్యాసంస్థల యజమాని కేశవరెడ్డి ఫేస్
బుక్ ఫేక్ అకౌంట్ పేరుతో లావాదేవీలు జరిపిన గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు కేశవరెడ్డి పేరుతో ఎంపిక చేసుకున్న కొందరికి చాటింగ్ చేస్తూ నగదు అవసరం గా కోరడం తో కొందరు నగదు ను ట్రాన్స్ ఫర్ చేసినట్లు సమాచారం.నగదు మళ్ళీ కావాలంటూ
చాటింగ్ చేయడంతో ఆ..వ్యాపారి అనుమానంతో కేశవరెడ్డి కి ఫోన్ చేసి తెలపడంతో అసలు రంగు బయట పడింది. దింతో గత్యంతరం లేక ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ ను హోల్డ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సైబర్ నేరాలపై పోలీసులు దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.